మరో ఆరుగురికి కరోనా పాజిటివ్____ఆర్.డి. ఓ

మరో ఆరుగురికి కరోనా పాజిటివ్____ఆర్.డి. ఓ

user-default | Mob: | 22 Oct

ముంబై నుండి వచ్చిన వలస కూలీలు మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అమలాపురం ఆర్.డి. ఓ బి.హెచ్. భవానీ శంకర్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాల క్వారం టైన్ సెంటర్ లో ముంబై నుండి వచ్చిన వలస కూలీలు 25 మందికి శాంపిల్స్ పరీక్ష చేయగా అందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వీరందరినీ చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్.డి. ఓ పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల కొరకు ఏర్పాటు చేసిన పడకల సామర్ధ్యం పూర్తి అయ్యాక ఇటీవల వచ్చిన మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను కూడా వేరుగా గది వుంటే వారి స్వగృహాలకు పంపడం జరుగుతుందని అయితే ముందుగా కరోనా సోకిన వ్యక్తి నుండి, మరియు ఆవ్యక్తి కుటుంబ సభ్యుల నుండి గృహం నుండి బయటకు రాము అని స్వీయ దృవీకరణ పత్రాలను (సెల్ఫ్ డిక్లరేషన్,మరియు డిక్లరేషన్) తీసుకుని ఇంటికి పంపడం జరుగుతుందని ఆర్.డి. ఓ తెలిపారు.స్వగృహం లో వున్న కరోనా రోగి ని 24 గంటలూ వైద్య ఆరోగ్య బృందం పర్యవేక్షిస్తుందని ఆర్.డి. ఓ తెలిపారు.అలాగే ఎప్పటికప్పుడు వారి కదలికలను కూడా గమనిస్తూ వారి పై పూర్తి నిఘా వుంటుంది కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ కోవిడ్_19 ఆసుపత్రుల పూర్తి సామర్ధ్యం ముగుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ఇది అత్యవసర పరిస్తితి అయినందున ప్రజలు అర్థం చేసుకుని నిరసనలు,ధర్నాలు పేరుతో ఆందోళనలు చేపట్టకుండా సంయమనం పాటించాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో ఇదే ప్రోటోకాల్ అనుసరిస్తున్నందున రాబోయే రోజుల్లో కరోనా ను సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలంటే ప్రజలందరికీ అవగాహన చాలా అవసరమని ఆర్.డి. ఓ అన్నారు.ప్రతీ గ్రామంలో ప్రతీ వ్యక్తికి సామాజిక దూరం పాటించడం,మాస్క్ లు, సానిటైజర్స్ వినియోగం వంటి అంశాలపై అవగాహన చాలా అవసరమని ఆర్.డి. ఓ చెబుతూ ప్రజలందరూ విచక్షణ తో మెలుగుతూ ప్రభుత్వానికి సహకరించాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved