సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..కమిషనర్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..కమిషనర్

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ దినకర్ పుండ్కర్ అన్నారు.బుధవారం కచ్చేరి పేటలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ,మున్సిపల్ సిబ్బందిపై ఉందన్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తిచెందడం కారణంగా వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృధ్ది చెంది అంటు వ్యాధులకు కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు. దోమల బారిన పడకుండా దోమతెరలు వాడేలా ప్రజలకు వివరించాలన్నారు. వ్యాధులకు సంబంధించిన పోస్టర్లను ముద్రించి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వ్యాధు ల గురించి ఉపాధ్యాయులు పిల్లలకు వివరించాలన్నారు. సీజనల్ వ్యాధుల గురించి మురికివాడల్లో ఎక్కువగా ప్రచారం చేయాలన్నారు. అలాగే 0 నుంచి 18 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి వ్యాధి నివారణ టీకాలు వేయాలన్నారు. ఇంటింటి సర్వే చేసి టిబి రోగులను గుర్తించి ఆశ వర్కర్ల ద్వారా వారికి చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ అధికారులు మలేరియా అధికారి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved