కొత్తగా 27 పాజిటివ్ కేసులు.

కొత్తగా 27 పాజిటివ్ కేసులు.

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

అమలాపురం డివిజన్ లో మంగళవారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అమలాపురం ఆర్.డి. ఓ బి.హెచ్. భవానీ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరంతా ముంబై నుండి వచ్చిన వలస కూలీలే నని ఆర్.డి. ఓ తెలిపారు. రాజోలు క్వారం టైన్ సెంటర్ లో 80 మందికి శాంపిల్స్ తీయగా 68 మందికి నెగిటివ్ రాగా 12 మందికి పాజిటివ్ వచ్చిందని, రావులపాలెం క్వారం టైన్ సెంటర్ లో 80 మందికి శాంపిల్స్ తీయగా అందులో 75 మందికి నెగిటివ్ రాగా 5 మందికి పాజిటివ్ వచ్చిందని ఆర్.డి. ఓ తెలియచేశారు. అమలాపురం డి.ఆర్.డి.ఏ క్వారం టైన్ సెంటర్ లో 113 మందికి శాంపిల్స్ తీయగా 103 మందికి నెగిటివ్ రాగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని ఆర్.డి. ఓ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారందరినీ అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నామని వీరంతా మే 31 వ తేదీ రాత్రి ముంబై నుండి నేరుగా క్వారం టైన్ సెంటర్ లకు రావడం జరిగిందనీ, వీరంతా అక్కడ వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్నారని ఆర్.డి. ఓ పేర్కొన్నారు. వలస కూలీలు అందరూ వారి స్వస్థలాలకు చేరుకునే క్రమంలో అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకుండానే రావడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. కిమ్స్ లో కరోనా పాజిటివ కేసుల సంఖ్య 115 అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం 115 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారని ఆర్.డి. ఓ భవానీ శంకర్ తెలిపారు.జిల్లా లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అన్నీ కిమ్స్ ఆసుపత్రి కే తరలించడం జరుగుతోందని వీరందరినీ చికిత్స అనంతరం త్వరలోనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కిమ్స్ లో కరోనా రోగుల చికిత్స కొరకు ఏర్పాటు చేసిన పడకల సామర్ధ్యం 730 అని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రస్తుతం నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అన్నీ వివిధ రాష్ట్రాలనుండి వచ్చి ఇక్కడ క్వారం టైన్ సెంటర్ లలో నమోదైనవే కానీ డివిజన్ లో ని ఏ మండలం లోను నమోదు అయినవి కాదని, కరోనా ను నియంత్రించడం లో మనం విజయవంతం అయ్యా మని, ఈ విషయంలో యంత్రాంగం ఎంతో బాగా పని చేస్తున్నారని మానసిక స్థైర్యం తో అధికారులు పని చేస్తున్నందుకు వారికిి జోహార్ లని ఆర్.డి. ఓ అభినందించారు.బయట రాష్ట్రాల నుండి వచ్చిన వారిని జనావాసాల లో కలవకుండా క్వారం టైన్ లో పెట్టి నెగిటివ్ వస్తెనే పంపు తున్నామని ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆర్.డి. ఓ తెలిపారు. కరోనా నియంత్రణ విషయంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ స్వీయ రక్షణ పాటించాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved