దీర్ఘకాలిక నిరీక్షణ.. 22 ఏళ్ల పోరాటం..

దీర్ఘకాలిక నిరీక్షణ.. 22 ఏళ్ల పోరాటం..

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

దీర్ఘకాలిక నిరీక్షణ , 22 ఏళ్ళ పాటు పోరాటం చేసినా తమ పై ప్రభుత్వం కనికరం చూపలేదనిన వైఎస్సార్ 98 డి ఎస్ సి టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిత్తూరు కు చెందిన పి. సోమశేఖర్ ,ట్రెజరర్ బండారు శ్రీనివాసరావు లు పేర్కొన్నారు. మండపేట లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1998 లో ప్రభుత్వం నిర్వహించిన వ్రాత పరీక్ష నెగ్గి ,ఇంటర్వ్యూ కు వెళ్లినట్టు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనో ,అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్వాకం తో 22 ఏళ్ల నరకయాతనఅనుభవించామన్నారు.గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓ కమిటీ వేసారన్నారు. 98 డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని 2004లోనే నిర్ధారించారన్నారు.2009 సెప్టెంబర్ 5న సమావేశం నిర్వహించి 98 క్వాలిఫై వారికి ఉద్యోగాలిప్పిస్తామని మాట ఇచ్చారన్నారు. రాజన్న ఆకస్మిక మరణంతో తమ బతుకులు వీధి పాలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.తిరిగి తమ జీవితాలు జిత్తులమారి చంద్రబాబు చేతిలో చిక్కుకున్నాయని విమర్శించారు.2014 మానిఫెస్టోలో ప్రకటించి ఓ కమిటీ వేసి ఐదేళ్ల కాలయాపన చేసి ఉద్యోగాలివ్వాలని ఉత్తర ప్రగల్బాలు పలికి ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు.ఆ సందర్భంలో ప్రజా సంకల్ప పాదయాత్ర లో జగన్ ను కలువగా ఉద్యోగాలే కాదు ,నష్టపరిహారమూ ఇప్పిస్తానని మాట ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం తర్వాత కూడా తమ విషయంలో స్పష్టత రాలేదన్నారు.లాక్ డౌన్ నిబంధనలకు లోబడి క్వాలిఫైడ్ టీచర్ లు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 6 గంటలకు క్వాలిఫైడ్స్ కుటుంబ సమేతంగా ఉద్యోగ ఆశా జీవన జ్యోతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కొవ్వొత్తులు ,దీపాలు వెలిగించి ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఈ సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించి తమ జీవితాలలో ముఖ్యమంత్రి జగన్ వెలుగులు నింపాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 98 క్వాలిఫైడ్ మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved