భవన నిర్మాణ కార్మికులకు 10వేల రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి

భవన నిర్మాణ కార్మికులకు 10వేల రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

భవన నిర్మాణ కార్మికులకు 10వేల రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలనిఏఐటియు సి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అన్నారు సోమవారంకాకినాడలోది. కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏపీ ఏపీ ఎస్పి శాఖ ఆధ్వర్యంలో నెలవారి సమావేశం పద్మనాభం అధ్యక్షతన జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగాఏఐటియు సి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరైనారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు అందరికీ సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, అనేక ఉద్యమాలు చేయడంతో ఏఐటీయూసీ పోరాట ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్యాలయం నుండి కార్మికుని బ్యాంక్ ఖాతాలను అందజేయాలని అధికారులు తెలియజేశారని ఇది కేవలం ఏఐటీయూసీ పోరాట ఫలితం అని ఆయన అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతే, ప్రస్తుతం ఇసుక సమస్య వల్ల పనులు కోల్పోతున్నారని, ఇసుకను ఆన్లైన్ లో బుక్ చేసుకున్న నో స్టాక్ అని చూపిస్తుంది అని, ప్రభుత్వం తక్షణమే ఇసుకను అందుబాటులో ఉంచే వరకు పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని ప్రసాద్ పిలుపునిచ్చారు. సంక్షేమ బోర్డు ద్వారా పదివేల రూపాయలు తక్కువ కాకుండా మంజూరు చేయాలని, పదివేల రూపాయలు కన్నా తక్కువ మంజూరు చేస్తే తీవ్రతర ఉద్యమాలు చేపడతామని ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పద్మనాభం, కృష్ణ, కుమార్, భగవాన్, సత్యనారాయణ, శీను తదితరుల భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved