వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి...

వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి...

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని విరుద్ధంగా కాదని పి సి సి ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారుకాకినాడ జిల్లాకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను హైకోర్టు కాపాడిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టు బెంచ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగిస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక హర్షణీయమని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కక్షసాధింపు ధోరణి అహంకారంతో రాజ్యాంగ నిబంధనలకు తుంగలో తొక్కి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల కమిషన్ పదవీకాలాన్ని తగ్గిస్తూ మూక బలంతో ఆర్డినేషన్ తీసుకొని రావడం అది ఆర్టికల్ 213 కు వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది అని నురుకుర్తి తెలియచేసిన్నారు. పీ సీ సీ సంయుక్త కార్యదర్శి దాట్ల గాంధీరాజు మాట్లాడుతూ హై కోర్టు తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని వారు ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు పైన వైకాపా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకుని రాజ్యంగా బద్ధంగా నడుచుకోవాలని సూచించారు. కాకినాడ సిటీ ఇంచార్జి కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు 65 తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వాము చాల జాగ్రత్తగా పని చేయాలని లేకపొతే ప్రజలు తగిన రీతిలో మీకు బుద్ది చెపుతారు అని చేపిన్నారు. రాష్ట్ర బి.సి సెల్ కన్వీనర్ తాండ్రంకి రమణమూర్తి మాట్లాడుతూ కరోనా తో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వట్టి పోయిన గేదె దగ్గర పాలు పిండు తున్నట్లు కరెంటు బిల్ వసూళ్లు చేస్తున్నారు.ఇది చాల దారుణం అయిన విషయం కనుక పేద ప్రజల కష్టాలు అర్డం చేసుకొని కరెంటు బిల్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన్నారు. సమావేశంలో నాయకులు కంభం రాజబాబు, కుక్కల పోతురాజు, ముంజువరపు మాణిక్యాలరావు, దవులూరి ధనకోటి, దమ్ము నూకరాజు, బాడితిమేని వీరబాబు, జంపా రాంబాబు,మాడెం ప్రసాద్, కంబాపు పరశురాం, మైలపిల్లి నరసింహం, దవులూరు భాస్కర్, పార్టి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved