వైఎస్ఆర్సిపి ప్రజలను మోసం చేసింది... మాజీ ఎమ్మెల్యే

వైఎస్ఆర్సిపి ప్రజలను మోసం చేసింది... మాజీ ఎమ్మెల్యే

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

వైయస్సార్ పార్టీ నాయకులు పేద ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం ఉచితంగా ఇస్తామంటూ హామీలు ఇచ్చారని అంతేకాక నేను అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైతే ఇంటి కోసం డబ్బులు కట్టారు తిరిగి లక్ష రూపాయలు ఇచ్చేస్తానని ఇల్లు కూడా ఇచ్చేస్తాను అని హామీలు ఇచ్చారు అయితే అవన్నీ బూటక హామీలు గా మారాయి అప్పుడు మా పార్టీ అధికారంలో పేద వాళ్ళ కోసం ఇల్లు కట్టిస్తే ఇప్పటి నాయకులు వాటిని వారికి ఇవ్వకుండా అప్లికేషన్ పెట్టుకోండి అని అంటున్నారు అయితే అప్పటి అర్హుల కోసం కట్టిన ఇళ్లను అమ్ముకోవటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మారిందని అన్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీల ప్రకారం పేద ప్రజల్ని ఆదుకోండి అని విమర్శించారు ఈ కార్యక్రమంలో 13వ వార్డు కార్పొరేటర్ బాలాజీ తుమ్మల రమేష్ సత్యనారాయణ తదితర పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved