పేద ప్రజల భూములు బలవంతంగా లాక్కొని ఇళ్లస్థలాల ?

పేద ప్రజల భూములు బలవంతంగా లాక్కొని ఇళ్లస్థలాల ?

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

కిర్లంపూడి మండలం ముక్కలు గ్రామంలో మట్టి కూలి పని చేసే సగర లు పేద ప్రజల భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడంపై తీవ్రంగా ఖండిస్తూ శనివారం ఉదయం స్థానిక కిర్లంపూడి మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు .పేదల ఇళ్ల స్థలాలు తీసుకుని ఇళ్లస్థలాల సిగ్గు సిగ్గు ,సిపిఐ వర్ధిలాలి అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పేదలకు ఇస్తున్న బహుమతి పేద బడుగు బలహీన వర్గాలు వారికీ ,40 సంవత్సరాలుగా ఉంటున్న భూములను స్వాధీనం చేసుకోవడం మా అని అయన అన్నారు .కిర్లంపూడి మండలం ముక్కోలు సగరులు పేటలో లో పేదలు ఎప్పటి నుంచో ఉంటున్నారని అందర్నీ ఖాళీ చేసి బలవంతంగా ఇళ్ల స్థలాలు పేరుతో లేఅవుట్లువేయడం అన్యాయసం అన్నారు .ప్రభుత్వం నిర్ణయం మంచిది కాదని ఆయన విమర్శించారు .ఒకపక్క పేదలకు ఇల్లు అంటూ మరోపక్క వారి నోట్లో మట్టి కొట్టారు అని అన్నారు .ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు వీధివీధి తిరిగి పేదలకు అండగా ఉంటామని చెప్పి నేడు ఆ ప్రజలను పొట్ట మీద కొట్టడం దారుణం అన్నారు .అనంతరం తాసిల్దార్ గారి కలవడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని కలెక్టర్ గారి తో మాట్లాడదామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ,గ్రామం నాయకులూ ములికి రామస్వామి ,వెంకటరమమున ,సాధనాల నూకరాజు తంగెళ్ల రామమూర్తి తదితరులు పాల్గున్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved