అమలాపురం డివిజన్ లో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు___ ఆర్.డి. ఓ

అమలాపురం డివిజన్ లో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు___ ఆర్.డి. ఓ

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

అమలాపురం డివిజన్ లో శుక్రవారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అమలాపురం ఆర్.డి. ఓ బి.హెచ్. భవానీ శంకర్ తెలియచేశారు. చేయ్యేరు ఇంజనీరింగ్ కాలేజీ క్వారం టైన్ సెంటర్ లో ఈ ఆరుగురు వ్యక్తులు కు పరీక్ష లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆర్.డి. ఓ తెలిపారు. ముమ్మి డివరానికి చెందిన వీరంతా ఇటీవల ముంబై,గుజరాత్ నుండి రావడం జరిగిందని ,వీరిని చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల క్వారం టైన్ సెంటర్ లో వుంచడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు.కరోనా పాజిటివ్ వచ్చిన వీరిని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని, వీరు జనాల లో కలవనందున ఏ సమస్యా లేదని ఆర్.డి. ఓ తెలిపారు. నిన్న జరిగిన కమీషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీడియో కాన్ఫరెన్స్ లో చిన్న పిల్లలు, గర్భవతులు యే రాష్ట్రం నుండి వచ్చినా వారికి శాంపిల్స్ తీసి హోమ్ క్వారం టైన్ కు పంపమని చెప్పడం జరిగిందని, అయితే మన డివిజన్ లోని వేసులుబాటు ను బట్టి జిల్లా కలెక్టర్ ను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగు తుందని ఆర్.డి. ఓ తెలియ చేశారు. ఇక ముందు ముంబై,మహారాష్ట్ర,రాజస్తాన్, చెన్నై వంటి ఎక్కువ కరోనా కేసులు వున్న ప్రాంతాల నుండి వస్తున్న వారిని కనీసం 5 రోజులు క్వారమ్ టెన్ లో వుంచడం జరుగుతుందని, కరోనా నిర్ధారణ పరీక్షలు లో నెగిటివ్ వస్తె ఇంటికి పంపుతామని,పాజిటివ్ వస్తె కిమ్స్ కు తరలించడం జరుగుతుందని ఆర్.డి. ఓ తెలిపారు.జిల్లా లో కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజలందరూ భాధ్యత తో వ్యవహరించాలని ఆర్.డి. ఓ సూచించారు.ఎవరైనా ప్రక్క రాష్ట్రాల నుండి వస్తె సంభందిత మండల అధికారులకు గాని,వైద్యాధికారి గాని,పోలీస్ శాఖ కు గాని,గ్రామ వాలంటీర్లు కు వెంటనే తెలియ చేయాలని ఆర్.డి. ఓ తెలిపారు. అలాగే డివిజన్ లో శుభ కార్యాలకు గాని, పెద కర్మలకు, రజస్వల వంటి కార్యాలకు 30 మంది తో మాత్రమే నిర్వహించుకోవాలని,దానికి సంభందిత మండల తహసీల్దార్ నుండి అనుమతి పొందాలని ఆర్.డి. ఓ పేర్కొన్నారు. 30 మంది దాటితే చర్యలు తీసుకుంటామని ఆర్.డి. ఓ హెచ్చరించారు. అమలాపురం డివిజన్ లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 18 కాగా వీరిలో 9 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగిందనీ,మిగిలిన 9 కేసుల్లో ఈ రోజు నమోదు అయిన 6 కేసులు మినహా మిగిలిన 3 కేసులును 2,3 రోజుల్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుందనీ ఆర్.డి. ఓ తెలిపారు. డివిజన్ లో ఇంతవరకు ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని ఆయన తెలిపారు. అమలాపురం డివిజన్ లో ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు 5,139 చేయగా వీటిలో 18 పాజిటివ్ రాగా మిగిలినవి అన్ని నెగిటివ్ అని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రస్తుతం భట్ల పాలెం బివీసి, ఇంజనీరింగ్ కళాశాల లోను, చెయ్యే రు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ను ప్రభుత్వ కోవిడ్_19 క్వారం టైన్ సెంటర్ లు పనిచేస్తున్నాయని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కరోనా ను అరికట్టడం భాధ్యత గా తీసుకోవాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved