నేటితో ముగియనున్న జడ్ పి పాలకవర్గం

నేటితో ముగియనున్న జడ్ పి పాలకవర్గం

user-default | Mob: | 19 Oct

కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గం నేటితో ముగుస్తుంది. ఈ పాలకవర్గంలో అప్పటి అధికార పార్టీ సభ్యులు నామన రాంబాబు చైర్మెన్‌గా ఎంపిక అయ్యారు. ప్రదాన ప్రతిపక్షం సభ్యులు వైఎస్ఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నవీన్ కుమార్ అతి చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీలోకి చేరి అనూహ్యంగా రాంబాబును తప్పించి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టి ఈయన హయాంలో 100 సంవత్సరాల జడ్ పి వేడుకలు, పైలాన్ ఆవిష్కరణ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ఉధ్యోగులకు తన తండ్రి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేరిట ఒక ట్రస్ట్ వగైరా నిర్ణయాలు తీసుకున్నారు. నవీన్ కుమార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో షాపింగ్ నిర్మాణం, ట్రస్ట్ ఏర్పాటు అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ పాలక వర్గం సమావేశంలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిల మధ్య వివాదం అప్పటి కలెక్టరు కార్తకేయ మిశ్రా, సభలో సభ్యులు, అధికారులు ముక్కున వేలేసుకు‌నే విధంగా ఇద్దరి మధ్య కేకలు, వాటర్ బ్యాటిల్స్ తో కొట్టుకున్న సందర్భ కూడా ఈ పాలకవర్గానికి మచ్చగానే చెప్పొచ్చని మేధావులు వ్యాఖ్యనిస్తున్నారు. ఈరోజుతో ముగిసే పాలకవర్గం స్దానంలో కలెక్టరు మురళీధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved