పాత్రికేయుడు నూకరాజు కుటుంబానికి

పాత్రికేయుడు నూకరాజు కుటుంబానికి

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

తీవ్ర అనారోగ్యంతోబాధ పడుతున్న ఆంధ్రజ్యోతి విలేకరి టీ నూకరాజుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.లక్ష ఆర్థిక సహాయం చేసింది .నూకరాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతని గురించి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కే స్వాతి ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ డి హెచ్ వి సాంబశివరావు జాయింట్ కలెక్టర్ 2 జి రాజకుమారి దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వెంటనే స్పందించారు.అతని ట్రీట్ మెంట్ కి ఆరోగ్యశ్రీ వర్తించదు అని ప్రైవేటు వైద్య సంస్థ నిరాకరించింది వారితో రాజకుమారి మాట్లాడారు. ట్రీట్మెంటు చేయించారు. నూకరాజు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలుసుకున్న రాజకుమారి రిలియన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో సంప్రదించారు సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జనరల్ మేనేజర్ పోతాప్రగడ సుబ్రహ్మణ్యం రూ.లక్ష చెక్కు సమకూర్చారు. గురువారం కలెక్టర్ మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ 2 రాజకుమారి నూకరాజు కు ఈ చెక్కును అందజేశారు. నూకరాజు కుటుంబానికి కావలసిన ఇతర సహకారాన్ని, పూర్తి వైద్య ఖర్చులను కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి అందజేస్తామని కలెక్టర్ మురళీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ 2 రాజకుమారి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సుబ్రహ్మణ్యం, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి సాంబశివరావు పాల్గొన్నారు. కలెక్టర్, జె సి 2 లకు స్వాతి ప్రసాద్, సాంబశివరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved