స్వర్ణ కారులకు 10 వేల ఆర్థిక సాయం అందించాలి..రాష్ట్ర స్వర్ణకారసంఘం అధ్యక్షులు

స్వర్ణ కారులకు 10 వేల ఆర్థిక సాయం అందించాలి..రాష్ట్ర స్వర్ణకారసంఘం అధ్యక్షులు

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

లాక్ డౌన్ ,కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన స్వర్ణ కారులు , విశ్వబ్రాహ్మణ పంచ వృత్తులు చేస్తున్నవారికి ప్రభుత్వం తక్షణమే పదివేల రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ కోరారు గురువారం కాకినాడలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష జిల్లా అధ్యక్షులుతామరపల్లి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల మంది స్వర్ణకారులు ఉన్నారని జిల్లాలో 16 వేల మంది స్వర్ణకారులు గత 70 రోజులుగాలౌక్ డౌన్ నేపథ్యంలో చేతి వృత్తి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో స్వర్ణ కారులకు ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణ పంచ వృత్తులు చేస్తున్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు 13 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు స్వర్ణకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వేణుమాధవ్ డిమాండ్ చేశారు స్వర్ణకారుల పై పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులు అక్రమ రికవరీలో పై ప్రభుత్వం జారీ చేసిన 272 జీవోను తక్షణమే మార్పులు చేయాలని కోరారు పెళ్లిళ్లలో పవిత్రంగా భావించే మంగళ సూత్రాలు స్వర్ణకారుల తయారుచేసి విక్రయించే విధంగా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నరవ శ్రీ నివాసరావు ,సెక్రటరీ టి.శ్రీ నివాస్రావు.సభ్యులు కె.సూరిబాబు ,సర్దార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved