ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు వారి ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు 98 వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సర్పవరం కూడలిలో గల ఎన్టీఆర్ కాంస్యవిగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, ఇతర నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ బిసిలు అందరికీ రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. సత్తిబాబు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలో అధికారం చేపట్టి రికార్డు సృష్టించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాలను ప్రజలకు తెలియజెప్పిన ఎన్టీఆర్ అన్నారు. సామాన్యులకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని, సంక్షేమ పథకాలు అమలుచేయాలని సంకల్పించి పేదలకు కూడు గూడు గుడ్డ అందించారని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. కరోనా నేపధ్యంలో డిజిటల్ విధానంలో జరిగే మహానాడులో పాల్గొంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved