ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలి..జిల్లా కలెక్టర్

ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలి..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబంలోని సభ్యులందర్ని వలంటీర్లు, ఆశా వర్కర్లు సర్వే చేసి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సూచించారు.మంగళవారం రాజీవ్ గృహకల్ప ఐదో విడత కోవిడ్ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలుత పోస్టర్ ను విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్వే చేసే ఇంటి వద్ద నుంచే వలంటీర్ల యాప్‌ నుంచి జీపీఎస్‌ ద్వారా సర్వే వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూదీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు, 60 సంవత్సరాలు నిండిన వయో వృద్దులు, గర్భవతులు, బాలింతలు, పది సంవత్సరాల్లోపు పిల్లలందరి వివరాలను నమోదు చేయాలన్నారు. ఏ వ్యక్తి అయినా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ స్వచ్చంధంగా ముందుకొస్తే అలాంటి వారు 104కు ఫోన్‌ చేయాలన్నారు. ఒకవేళ కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంటిలోనే స్వీయనిర్భంధంగా ఉండేందుకు అంగీకరిస్తే అలాంటి వారిని వైద్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. జెసి కీర్తి,కమిషనర్ దినకర్ పుండ్కన్ మాట్లాడుతూకరోనా వైరస్ కు భయపడాల్సిన పని లేదని నిబంధన లు పాటిస్తే వ్యాధి దరిచేరదు అన్నారు ఈ కార్యక్రమంలోడీసీహెచ్‌ఓ డా. సుశీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved