షాపింగ్ కూల్చడమా టెండర్ ద్వారా అద్దెకా?

షాపింగ్ కూల్చడమా టెండర్ ద్వారా అద్దెకా?

user-default | Mob: | 24 Oct

జిల్లాపరిషత్ షాపింగ్ నిర్మాణంపై కలెక్టరు సీరియస్? కాకినాడ జిల్లా పరిషత్ పాలకవర్గం నిర్ణయం మేరకు నిర్మించిన జ్యోతుల నవీన్ కుమార్ షాపింగ్ కాంప్లెక్స్ మీద కలెక్టర్ మురళీధర్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఏళ్ల తరబడి షాపింగ్ కాంప్లెక్స్ స్దానంలో మూడు షాపులు ఉండేవి. ఆ షాపులను తొలగించి వాటి స్దానంలో ఆరు షాపులు క్రింద, మరో ఆరు షాపులు పై భాగంలో నిర్మించారు. ఈ షాపులకు ఎటువంటి అనుమతులు మరియు షాపుల కేటాయింపులో ఎటువంటి పారదర్శకత పాటించక పోవడంతో అనేక విమర్శలకు తావిస్తుంది. ఈ నిర్మాణం మీద కలెక్టరుకు ఫిర్యాదులు అందినట్లు వాటిమీద జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ను వివరణ అడిగినట్లు తెలిసింది. జడ్ పి అధికారులలో చాలామంది షాపింగ్ ను కూలుస్తారనే వదంతులు కూడా ఎక్కువగా ఉంది. ఏమి జరగనునుందో వేచి చూడాల్సిన పరిస్థితి కాకినాడలో నెలకొంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved