నగరం లో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్

నగరం లో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కాకినాడ కార్పొరేషన్ కమిషనర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరంలో సోమవారం తెల్లవారుజామున  సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాకినాడలోని గాంధీనగర్ రేచర్ల పేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు బహిరంగ మూత్ర విసర్జన చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని  ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజీ, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే వాటికి  సంబంధిత అధికారులపై చర్యలు  చేపడతామని హెచ్చరించారు.  పబ్లిక్ టాయిలెట్లు పరిశీలించి, టాయిలెట్లలో మరింత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులపై నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లు తొలగించకపోవడతో కార్పొరేషన్ అధికారులపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా ఇరుకైన సందుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల  నిర్వహణనపై  తనిఖీ చేసిన కమిషనర్. ఇంటింటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోలకు అందించాలని  నివాసితులకు సూచించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved