స్వచ్చందంగా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలి..జిల్లా కలెక్టర్

స్వచ్చందంగా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలి..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

స్వచ్చందంగా కరోనా టెస్ట్ లు చేయించుకునుందుకు వచ్చే ప్రజలకు పరీక్షలు నిర్వహించేందుకు కాకినాడ జిజిహెచ్ లో ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు . ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని సందర్శించి కరోనా వైరస్ టెస్ట్ లు నిర్వహిస్తున్నా తీరు , వలంటరీగా టెస్ట్ చేయించుకునేందుకు వచ్చే ప్రజల సంఖ్య పెరుగుదల కనుగుణంగా అవసరమైన ఏర్పాట్ల విస్తరణలను ఆసుపత్రి సూపరింటెండెంట్ , కోవిడ్ -19 టెస్టింగ్ విభాగ వైద్యులతో సమీక్షించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 నియంత్రణలో భాగంగా సోమవారం నుండి ఇంటింటి సందర్శన బృందాలు విస్తృతంగా ఆవాసాల్లో పర్యటించి అనుమానిత లక్షణాలు కలిగిన ప్రజలను స్వచ్ఛందంగా వైరస్ టెస్ట్ లు చేయించుకోవాలని కోరుతున్నందున కరోనా పరీకల కోసం జీజీహెచ్ కు స్వచ్ఛందంగా వచ్చే ప్రజల సంఖ్య గణనీయంగా పెరగనుందని , తదనుగుణంగా వారందరికీ ప్రమాణిక జాగ్రత్తలు పాటిస్తూ త్వరితగతిన పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను జిజిహెచ్ లో చేపట్టాలని సూచించారు . కరీనా వైరస్ నిర్ధారణకు నిర్వహించే వివిధ రకాల పరీక్షలు , వాటి నిర్వహణకు పట్టే సమయం , అవసరమైన అదనపు సిబ్బంది , వారికి తగు కణ కల్పన గురించి ఆయన ఆడిగి తెలుసుకున్నారు . పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల సమాచారం కొరకు ఆసుపత్రిలో కరోనా జాగ్రత్తల సమాచారంతో పెద్ద సైజులో ఉస్పీ బోర్డులు ఏర్పాటు చేయాలని , అలాగే ఎటువంటి లకణాలు ఉంటే పరీకలు చేయించుకోవాలో ప్రజలకు వివరించేందుకు కౌన్సిలింగ్ కౌంటర్ లు ఏర్పాటు చేయాలని సూచించారు . టెస్ట్ కొరకు వచ్చే ప్రజలు తప్పని సరిగా మాస్క్ ధరించాలని , చేతులు కడుకునేందుకు సబ్బు - నీరు , శానిటైజర్ పరీక్షా కేంద్రంలో అందుబాటులో చాలని కోరారు . కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న బృందాలు , ఆసుపత్రి అధికారులు , సిబ్బంది ఆరోగ్య సితు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని , అలాగే ప్రజలు కూడా యాప్ ను వినియోగించేలా కోరాలన్నారు . అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు . ఈ కార్యక్రమంలో జిటిహెచ్ సూపరింటెండెంట్ డా.యం.రాఘవేంద్రరావు , కోవిడ్ -19 టెస్టింగ్ విభాగం వైద్యులు , సిబ్బంది పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved