ఇసుక ,నే మాం ఇళ్ల స్థలాలు సమస్యలపై మంత్రి కన్నబాబు ను కలిసిన సిపిఐ జిల్లా బృందం

ఇసుక ,నే మాం ఇళ్ల స్థలాలు సమస్యలపై మంత్రి కన్నబాబు ను కలిసిన సిపిఐ జిల్లా బృందం

user-default | Mob: | 29 Oct

:జిల్లాలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు అని ,ఇసుకకోరతా తీర్చాలని , కార్మికులు ఆదుకోవాలని అదేవిధంగా కాకినాడ రూరల్ నేమం భూములకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ,జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాదు తో పటు ప్రతినిధి బృందం కలిసి విజ్ఞాపన పత్రం అందజేసారు .ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ గత సంవత్సరం ముందు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటించే రని ఇప్పుడు మరలా కరానా లాక్ డౌన్ వలన ఇసుక కొరతతో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు .ఇసుక కొరతకు కారణం ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది అని తెలియజేశారు .అదేవిధంగా నేమం లో అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో సిపి ఐ పార్టీ వ్యతిరేకం కాదని కానీ అక్కడ 40 ఏళ్ల గా ఉన్న దళితులు భూములకు పట్టాలు ఇచ్చి వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు .ఈ సందర్భంగా మంత్రి గారు సమాధానమిస్తూ సమస్యలను పరిస్కరిచుతామని హామీ ఇచ్చారు . దీనిలో సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం ,రామచంద్రరావు లోవరాజు నాగరాజు ఏఐవైఎఫ్ అధ్యక్షులు వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved