ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ ఔట్‌!

ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ ఔట్‌!

user-default | Mob: | 31 Oct

న్యూజిలాండ్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడినా.. సెమీఫైనల్‌ చేరడం దాదాపుగా లాంఛనమే. పాకిస్థాన్‌ నిష్క్రమణ కూడా ఖాయమే. ఎలాగంటే.. అన్ని మ్యాచ్‌లూ ఆడేసిన కివీస్‌ ఇప్పుడు 11 పాయింట్లతో.. ఆస్ట్రేలియా (14), భారత్‌ (13), ఇంగ్లాండ్‌ (12) తర్వాత నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ 0.175. 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌ (5వ స్థానం) నెట్‌ రన్‌రేట్‌ -0.792. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే 11 పాయింట్లతో కివీస్‌ను సమం చేయగలుగుతుంది. కానీ పాకిస్థాన్‌.. రన్‌రేట్‌లో ఆ జట్టును దాటడం దాదాపు అసంభవమే. అలా దాటాలంటే కనీసం 316 పరుగుల తేడాతో నెగ్గాలి. లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే పాకిస్థాన్‌కు సెమీస్‌ చేరే అవకాశమే ఉండదు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved