విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి...

విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి...

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో విద్యుత్‌ బిల్లులకు సంబంధించి రీడింగ్‌ తీయకపోవడంతో మేలో రీడింగ్‌ తీశారని, దీనివల్ల యూనిట్లు అధికంగా రావడంతో డబుల్‌చార్జీలు వేశారని మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో విద్యుత్‌ చార్జీల మోతతో ప్రజలు మరింత ఆందోళనకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. తక్షణం న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరెంటు చార్జీల పెంపుకు నిరసనగా జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన టిడిపి నాయకులతో కలసి ఈ నిరసన చేపట్టారు. నల్ల రిబ్బాన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అసలే లాక్ డౌన్ వలన పనులు లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్ధికంగా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి ప్రజలపై కరెంటు బిల్లుల భారం మోపడం అన్యాయం అన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాకా ఇలాచేయడం మోసంచేయటమెనన్నారు.  పేదప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న లాక్ డౌన్ నేపధ్యంలో 3 నెలల విధ్యుత్ బిల్లులు రద్దుచేసి, పాత శ్లాబు విధానంలోనే కరెంటు చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సూర్య నారాయణ, తదితర్లు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved