ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

user-default suresh gona | Mob: 7799146666 | 07 Jul

దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ29వ వర్దంతిని పురస్కరించుకొని గురువారం కాకినాడజిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు నురుకుర్తివెంకటేశ్వరరావు,కాంగ్రెస్ కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ కాంగ్రెస్‌ నాయకులు నివాళులు అర్పించారు. స్థానిక రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ హయాంలోనే దేశం అభివృద్ధి సాధించిందన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసం ఆయన ప్రవేశపెట్టిన పలు పథకాలు నేటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. కార్యక్రమంలో తాళ్లూరు రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved