ఇళ్ళ పట్టాల పంపిణీ కి ప్లాట్లను సిద్దం చేయండి_____మంత్రి విశ్వరూప్

ఇళ్ళ పట్టాల పంపిణీ కి ప్లాట్లను సిద్దం చేయండి_____మంత్రి విశ్వరూప్

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సేకరణ ప్రక్రియను,లే అవుట్ ల అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే విశ్వరూప్ అధికారులను ఆదేశించారు. బుదవారం మంత్రి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తో కలిసి అమలాపురం రూరల్ మండలం లో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సిద్దం చేస్తున్న లే అవుట్ లను పరిశీలించారు.ముందుగా చింతాడ గరువు లో ఒక ఎకరం ఇరవై ఆరు సెంట్ల లో 39 మంది లభిదారుల కొరకు సిద్దం చేస్తున్న ప్లాట్లను మంత్రి, కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్,మరియు మంత్రి మాట్లాడుతూ సత్వరం ప్లాట్లను రహదారుల తో సహా పూర్తి స్థాయి లో అభివృద్ది చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.అనంతరం మంత్రి, కలెక్టర్ చింతాడగరువు లో రైతు భరోసా కేంద్రం కొరకు సిద్దం చేసిన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30 తేదీకి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభానికి సిద్దం చేయాల్సిందిగా అమలాపురం ఎం.పి.డి. ఓ ప్రభాకరరావు ను ఆదేశించారు. అలాగే మండలానికి మంజూరు అయిన 22 రైతు భరోసా కేంద్రాలు, 22 స చివాలయాలు,22 విలేజ్ క్లినిక్ లుకు సంబందించిన పనులను వెంటనే ప్రారంభించాలని ఎం.పి.డి. ఓ ప్రభాకరరావును ఆదేశించారు.అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్ అమలాపురం రూరల్ మండలం జనుపల్లి లో నాడు_నేడు కార్యక్రమం క్రింద జిల్లా ప్రజాపరిషట్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ చుట్టూ 29 లక్షల తో నిర్మించిన కాంపౌండ్ వాల్ ను పరిశీలించారు.అనంతరం మంత్రి,కలెక్టర్ పాలగుమ్మి గ్రామం లో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంభందించి 81 మంది లబ్దిదారుల కొరకు రెండు ఎకరాల, 18 సెంట్లలో సిద్దం చేస్తున్న ప్లాట్ల ను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ వెంట అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్, అమలాపురం మండలం మాజీ జెడ్పీటీసీ కుడుపూడి వేంకటేశ్వర(బాబు) మట్ట పర్తి నాగేంద్ర, అమలాపురం మండలం ఎం.పి.డి. ఓ ప్రభాకరరావు, మండల తహసీల్దార్ మాధవరావు, ఎం.ఇ .ఓ డి.విమల కుమారి, గృహా నిర్మాణ శాఖ ఈ.ఈ. ఎన్. గణపతి రావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు షంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయాలు పనిచేయాలి____మంత్రి విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి అమలాపురం రూరల్ మండలం చింతాడ గరువు లోని గ్రామ సచి వాలయాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామ సచివాలయ ఉద్యోగుల పనితీరును పరిశీలించి రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం మాదిరిగా గ్రామ సచివాలయాలు పని చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. 540 రకాల సేవలు గ్రామ సచి వాలయాలు ద్వారా ప్రజలకు అందించ వలసి వుందని, ప్రతీ సేవ నిర్దేశించిన సమయం లో ప్రజలకు అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సచివాలయం లో అయ్యే పని కొరకు కలెక్టర్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ చెబుతూ ఏయే సేవలు ఇంతవరకు సచివాలయం ద్వారా అందించారో రిజిస్టర్ లను కలెక్టర్ పరిశీలించడం తో బాటు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ సచివాలయం అందించే సేవలు పై ప్రజల కు నమ్మకం, విశ్వాసం కలగాలని కలెక్టర్ ఉద్యోగులను ఆదేశించారు. అలాగే ఉద్యోగులు పనితీరును మెరుగు పరుచు కోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే వారికి 72 గంటలలో పెన్షన్ మంజూరు కావాలని ఈ దిశగా సచి వాలయ ఉద్యోగులు తమ పనితీరు మెరుగు పరుచు కోవాలనీ కలెక్టర్ ఆదేశించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved