జిల్లాలో 9 డిపోల నుండి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం : ఆర్ఎమ్.

జిల్లాలో 9 డిపోల నుండి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం : ఆర్ఎమ్.

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

తూర్పుగోదావరి జిల్లాలోని 9 డిపోల నుండి పరిమిత సంఖ్యలో బస్ సర్వీసులు గురువారం నుంచి ప్రారంభం అవుతాయని రాజమండ్రి రీజియన్ రీజినల్ మేనేజర్ఆర్.వి.ఎస్.నాగేశ్వరరావు తెలిపారు.మూడవ విడత లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మరియు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉత్తర్వులకు అనుగుణంగా విడతాలవారిగా బస్ సర్వీసులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.తొలివిడత గా నిర్ణయించిన రూట్లలో,పరిమిత సీట్లలో పరిమిత ప్రయాణికులను అనుమాతిస్తామని స్పష్టం చేశారు.ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వీసులు ఉంటాయన్నారు.నిర్ణయించిన రూట్లలో బస్సులందు కoడక్టర్లు ఉండరని,టిక్కెట్లు బస్ స్టేషన్లు,మార్గమధ్యంలో నిర్ణయించిన స్టేషన్లలో టిక్కెట్లు ప్రయాణికులు ముందుగా తీసుకోవాలని సూచించారు.ప్రయాణికులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని కోరారు.అమలాపురం డిపో నుండి విశాఖపట్నం, విజయవాడ,రాజమండ్రి,భీమవరం, కాకినాడ వరకు తిరుగుతాయని అన్నారు. అలాగే గోకవరం డిపో నుండి రాజమండ్రి, జగ్గంపేట, రాజమండ్రి డిపో నుండి విశాఖ, విజయవాడ,కాకినాడ నాన్ స్టాప్, కాకినాడ వయా రాజానగరం, వయా ద్వారపూడి,తుని, రావులపాలెం నుండి సామర్లకోట, కాకినాడ, ఏలూరు, రాజోలు డిపో నుండి విశాఖ, రాజమండ్రి, ఏలేశ్వరం డిపో నుండి కాకినాడ వయా ప్రత్తిపాడు, కాకినాడ డిపో నుండి విశాఖ, విజయవాడ,రాజమండ్రి నాన్ స్టాప్, అమలాపురం నాన్ స్టాప్, రావులపాలెం,రాజమండ్రి, అమలాపురం పల్లెవెలుగు సర్వీసు, రామచంద్రాపురం నుండి రాజమండ్రి, సామర్లకోట,తుని డిపో నుండి నర్సీపట్నం,కాకినాడ, రాజమండ్రి సర్వీసులు తొలివిడత లో ఉంటాయి.పరిస్థితులను బట్టి క్రమంగా సర్వీసులు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved