తిరుపతి లడ్డూను అంగడి వస్తువుగా.. స్వీట్ స్టాల్ విక్రయం చేయడం తగదు!!

తిరుపతి లడ్డూను అంగడి వస్తువుగా.. స్వీట్ స్టాల్ విక్రయం చేయడం తగదు!!

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

స్వీట్ స్టాల్ తరహాగా ముందస్తు ఆర్డర్లపై.. దేశవ్యాప్తంగా తిరు పతి లడ్డూ విక్రయా లకు ద్వారాలు తెరుస్తున్న టిటిడి తీరు అత్యంత దురదృష్టకరమని కాకినాడభోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్ల పూడి రమణరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడి వారైనా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామిని దర్శించి ప్రసాదంగా లడ్డూలు తీసుకు వెళ్లడం సంప్రదాయం కాగా .. ఆధ్యాత్మికతకు అర్థం లేకుండా స్వామివారి లడ్డూను స్వీట్ స్టాల్ తరహాలో దేశం మొత్తంగా అమ్ముకునే కార్పొరేట్ వ్యాపారం చేపట్టడం హిందూ ధార్మికత మెచ్చే విధానం కాదని రమణరాజు అన్నారు. తిరు మలలో దర్శనానికి తావు లేకుండా.. లడ్డూ విక్రయాలు అంటూ రోడ్డున పడటం టి టి డి కి తగదన్నారు. కరోనా లాక్ డౌన్ తో టి టి డి దిగాలు పడి పోవడం శోచనీయమన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందల వేల కోట్ల రూపాయల టిటిడి నిధులు ఇష్టా రాజ్యం చేయడమే పనిగా అన్ని ప్రభుత్వాలు పోటీపడి వ్యవహరించాయని ఇకనైనా పాలక మండళ్లు ఈతీరు మానుకోవాలన్నారు. దేవా దాయ శాఖలో.. తిరుమల తిరుపతిలో ఉద్యోగులకు సక్రమంగా జీతాలు లేకుండా మూల విరాట్ కైంకర్యాల కు నిధుల కొరత రావడానికి ఇదే కారణమన్నారు. స్వామి వారి లడ్డూను అంగట్లో అమ్మే వస్తువుగా తిరుపతిని స్వీట్ స్టాల్ తరహాగా ఏమార్చవద్దని హితవు పలికారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved