జిల్లా వ్యాప్తంగా 144 సిఆర్ పి సెక్షన్ అమలు.. జిల్లా కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా 144 సిఆర్ పి సెక్షన్ అమలు.. జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో లాక్ డౌన్ ను మే నెల 31 వరకు విధించడం జరిగిందని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు . దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా 144 సిఆర్ పి సెక్షన్ అమలులో వుంటుదని ఆయన తెలియజేసారు . దీనికనుగుణంగా నాలుగురు మించి ఎవరును గుంపుగా జిల్లా వ్యాప్తంగా వుండరాదని ఆయన తెలియజేసారు . అదే విధంగా ద్విచక్ర వాహనమైతే ఒక మనిషి మాత్రమే అముమతించబడతారని , అదే నాలుగు చక్రాల వాహనమైతే డ్రైవర్ తో కలిపి ముగ్గరు ప్రయాణించడానికి అనుమతించబడతారని తెలియజేసారు . అదికూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు . ప్రజలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటలు మాత్రమే పనుల నిమిత్తం వీధులల్లోకి అనుమతించబడతారని అన్నారు . ప్రతి రోజు రాత్రి 7 గంటల మండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు బయటకు రావడం నిషేదించడం జరిగిందని కలక్టర్ తెలియజేసారు . అయితే అత్యవసర మెడికల్ పరిస్థితులుంటే వారికి మినహాయింపు ఉంటుందని అన్నారు . ఏషాపుగానీ , ఎష్టఘిస్ మెంట్ గానీ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరుచుటకు అనుమతించబడతారని అన్నారు . అయితే స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారని ఆయన అన్నారు . షాపుల దగ్గర కరోన నియంత్రణలో చర్యల్లో భాగంగా భౌతిక దూరం . శానిటేషన్ వంటే తప్పని సరిగా షాపుల్లో పాటించాలని కలక్టర్ స్పష్టం చేసారు . కోవిడ్ -19 నియంత్రణలో పాల్గొనుచున్న సిబ్బందికి నిబంధనలకు మినహాయింపు ఉంటుందని అన్నారు . కాబట్టి జిల్లా ప్రజలు కోవిడ్ -19 నియంత్రణలో తమ సహకారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేపారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved