నిబంధనలు పాటించని ఆక్వా చెరువులపై కఠిన చర్యలు..జిల్లా కలెక్టర్

నిబంధనలు పాటించని ఆక్వా చెరువులపై కఠిన చర్యలు..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

. నిబంధనలను అతిక్రమించి పర్యావరణాన్ని హాని కలిగించడం తో పాటు కాల్యూషాన్ని గురిచేసే ఆక్వా చెరువుల పై కఠిన చర్యలు తీసుకోవాలి కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు . మంగళవారం కలక్టర్ తన కార్యాలయపు సమావేశ మందిరంలో రిజిష్టర్ , రెగ్యూలేట్ , ప్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ జిల్లా స్థాయి సమావేశం కలక్టర్ డి.మురళీదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది . జిల్లాలో వివిధ స్థాయిలో ఆక్వా సాగుకు 3 వేల 74 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు . కోవిడ్ -19 ప్రభావం కొంతవరకు తగ్గినందున సంబంధిత మండల తాహసిల్దారులు వారి పరిధిలో వున్న పెండింగ్ ధరఖాస్తులను రాబోయే రెండు నెలల్లో పరిశీలించి పరిష్కరించాలన్నారు . జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఆక్వా ఉత్పత్తులను సాగుచేస్తున్నారన్నారు . ఈ ఉత్పత్తుల సాగుకు అనుమతులు పొందిన భూముల సర్వే నెంబర్ల ప్రకారం ఇ - క్రాఫ్ బుకింగ్ నుండి తొలిగించాలన్నారు . జిల్లాలో ఆక్వారంగాన్ని పోత్సాహించే విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 41 వేల టన్నుల ఆక్వా ఉత్పత్తి చేయగలిగామన్నారు . కోవిడ్ -19 ప్రభావం ఉన్నప్పటి ఆక్వా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతి ధర చెల్లించడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చేయడం జరిగిందన్నారు . జిల్లా స్థాయి కమిటీలో నియమితులైన జాయింట్ కలక్టర్ ( ఆర్ ) జి.లక్ష్మీశ , కోన సీమలో ఎక్కువగా ఉత్పత్తులు జరిగే ఆక్వా ఉత్పత్తులను మరింత ప్రోత్సహించే విధంగా అధికారులు , రైతులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సూచించారు . కోవిడ్ -19 కారణంగా ఆక్వా ఉత్పత్తులు చేసే రైతులకు ఆదుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ ఆఫ్ సెప్టి , స్టేట్ ఇనపూట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కోటీశ్వరరావును నియమించి జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు చేసే రైతాంగానికి కనీస మద్దతి ధర అందిండంలో రైతులకు ఎటువంటి నష్టం లేకుండా ప్రోత్సహించిన జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి పని తీరును డిఎల్ సిసి సభ్యులు ప్రముఖ ఆక్వా రైతు సిహ చ్.సూర్యరావు ప్రత్యేకంగా అభినందించారు . ఈ సమావేశంలో ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ పి.జయరావు , పొల్యూషన్ , గ్రౌండ్ వాటర్ , ఇరిగేషన్ చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు . (

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved