మాజీ సర్పంచ్ సావిత్రమ్మ మృతి

మాజీ సర్పంచ్ సావిత్రమ్మ మృతి

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామ మాజీ సర్పంచ్ సబ్బెళ్ళ సావిత్రమ్మ మంగళవారం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఈమె 1995 నుండి 2001 వరకూ గ్రామ సర్పంచిగా గొల్లలమామిడాడ గ్రామానికి సేవలు అందిచారు. ఈమెకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు సబ్బెళ్ళ గంగిరెడ్డి పెదపూడి మండల అధ్యక్షుడుగానూ ,గొల్లలమామిడాడ గ్రామ సర్పంచిగానూ సేవలందించారు. రెండువ కుమారుడు ప్రసాద్ రెడ్డి నెల్లూరులో ప్రముఖ ఆక్వా వ్యాపార వేత్త, మూడవ కుమారుడు బుల్లియ్యరెడ్డి వైజాగ్ లో ప్రముఖ డాక్టర్ లు ఉన్నారు. సావిత్రమ్మ మృతికి ఎంఎల్ఏ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్ పిటిసి సత్తి భగవాన్ రెడ్డి, ద్వారంపూడి ప్రభాకరరెడ్డి,చింతా దొరబాబు, ద్వారంపూడివెంకటరెడ్డి(చింతపండు), ఛాంబర్ అధ్యక్షుడు ద్వారంపూడి వెంకటరెడ్డి, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డికర్రి, రెడ్డి సంఘం అధ్యక్షుడు సబ్బెళ్ళ రామలక్ష్మణరెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved