అమలాపురం ఎంపీ కిసైబర్ వల

అమలాపురం ఎంపీ కిసైబర్ వల

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

సైబర్‌ కేటుగాళ్లు ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేస్తున్నారు. పోలీసులకు వస్తున్న ఫిర్యాదులను చూస్తే అవుననే అనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా యథేచ్ఛగా నేర కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజాప్రతినిధులను మోసం చేస్తూ అందినంత దండుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 35 మంది ఓ సైబర్ నేరగాడి వలకు చిక్కారు. కేంద్రం నిధుల పేరుతో అమలాపురం ఎంపీకి సైబర్ నేరగాడి వల వేశాడు. రూ. 2 లక్షలు పేటీఎంలో పంపించి ఎంపీ మోసపోయాడు. దీంతో రహస్యంగా పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుతో కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని కోర్టులో హాజరుపరిచారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved