జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ..బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి

జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ..బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

రాష్ట్ర ప్రభుత్వ వరుస విధానాలకు వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తమ తమ ఇళ్ల వద్దే నిరసన దీక్ష చేపట్టారు. మంగళవారం కత్తిపూడి లో బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్లాబ్లు పెంచడం పట్ల అలాగే ప్రజల ఆస్తుల అమ్మకాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. లాక్ డోన్ కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ స్లాబ్ లు పెంచేసి సామాన్యులపై వేలకొద్దీ విద్యుత్ బిల్లు మోపటం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఏపీ పేరు మీద మిషన్ సెల్ ఏపీ చేస్తోందని, జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ఒకటొకటిగా అన్నీ అమ్ముకుంటే పోతే భవిష్యత్ తరాలకి ప్రజలకి ఏమి మిగులుతుంది అని ప్రశ్నించారు. ఈ తరహాలోనే గత పాలకులు చేసి ఉంటే ఈ ప్రభుత్వానికి అమ్ముకుంటానికి సెంటు భూమి కూడా మిగిలేది కాదు అని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకు కాపలాదారులు మాత్రమేనని ఓనర్ అయితే కాదని జగన్ ప్రభుత్వం వెంటనే ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని సంబంధిత జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులుఅధట్రా వెంకన్నదొర , మండల ప్రధాన కార్యదర్శిబెన్నయ్యదొర ,మండల ఉపాధ్యక్షుడు కొండెపూడీ సురేష్ , మండల కార్యదర్శి బొమ్మిడి లోవరాజుఅధట్రి శ్రీ రామ్ రవిచద్ర తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved