అహ్మదాబాద్‌లో ప్రారంభమైన రథయాత్ర - పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా దంపతులు

అహ్మదాబాద్‌లో ప్రారంభమైన రథయాత్ర - పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా దంపతులు

user-default | Mob: | 28 Oct

జగన్నాథుడి వార్షిక రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, ఆయన భార్య సోనాల్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళహారతి కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ రథయాత్ర శ్రీ గుండీచా ఆలయం వద్ద పరిసమాప్తం కానుంది. 2.5కి.మీ వరకు జరిగే ఈ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగుతారు. గుండీచా ఆలయానికి చేరుకున్న దేవతా మూర్తుల విగ్రహాలు..యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి జగన్నాథుడి ఆలయానికి చేరుకుంటాయి. బహుడ యాత్ర పేరిట ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ యాత్రికులకు వసతి విషయంలో ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. మే మొదటి వారంలో గుజరాత్‌ను ‘ఫణి’ తుపాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఏర్పాట్లు కాస్త కష్టమయ్యాయి. ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ యాత్రకు సుమారు 2లక్షల మంది వస్తారని అంచనా. ఈ యాత్రకోసం 10 వేల మందితో భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు కూడా సర్వం సిద్ధమైంది. పూరీ తీరంలో భక్త కెరటాలు పోటెత్తుతున్నాయి. మరికాసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved