తప్పనిసరిగాకోవిడ్ పరీక్షలు..జిల్లా కలెక్టర్

తప్పనిసరిగాకోవిడ్ పరీక్షలు..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించి నందున ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చే వారికి కరోనా టెస్టులు చేయాలని క్షేత్రాధికారులకు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు . సోమవారం కలక్టర్ తన కార్యాలయపు సమావేశ మందిరం నుండి జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ , కీర్తి చేకూరి , జి.రాజకుమారిలతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ యం.పి.డి.ఓలు , తాహసిల్దార్లు బయట ప్రాంతాల నుండి వచ్చే వారిని స్థానిక వాలంటీర్ల ద్వారా గుర్తించి క్వారంటైం సెంటర్లకు తరలించి పరీక్షలు నిర్వహించే విధంగా పర్యవేక్షించాలన్నారు . బయట నుండి వచ్చిన వారు తాము కోరిన మీదట హోం క్వారం టైన్ లో వుండ వచ్చన్నారు . టెస్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ వస్తే అలాంటి వారు హోం క్వారంటైన్లో వుంటామంటే వారికి ప్రత్యేకంగా కిట్ ఇవ్వడం జరుగుతుందన్నారు . పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయలో ఎమ్ పిడిఓ , తాహసిల్దార్లు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో చేస్తారన్నారు . ఇప్పటికే గృహనిర్మాణాల కోసం 2250 కోట్ల రూపాయాలు జిల్లాకు మంజూ రైయాయని అన్నారు . కోవిడ్ -19 పనులను వైద్యాధికారులు పర్యవేక్షస్తున్నందున రెవెన్యూ అధికారులు తమ దయనందిన పరిపాలన పనులు దృష్టి సారించాలన్నారు . లేఅవుట్ లెవిలింగ్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదిక లో జరిగే విధంగా మండల స్థాయి అధికారులు సమన్వయంలో పనిచేయాలని క్షేత్రస్థాయి అధికారులకు కలక్టర్ పలు సూచనలు చేసారు . ఇళ్ల పట్టాల పంపిణీ అర్హత వున్న వారిని మాత్రమే గుర్తించాలని అనర్హులు అయితే వారు ఎందుకు తిరస్కరించబడ్డారో వివరాలు వుండాలన్నారు . డిఆర్ డి ఏ ద్వారా స్వయం సహాయక సంఘాలు ద్వారా కోవిడ్ -19 పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు గత సంవత్సరం లో నేతన్న నేస్తం పధకంలో మగ్గం వుండి లబ్ధి పొందని లబ్ధిదారులు ఈ నెల 22 తేదీ వరకు ధరఖాస్తులు చేసుకోవచ్చన్నారు . మార్చి 31 , 2021 నాటికి జిల్లాలో అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాలు , వైఎస్ఆర్ క్లిళ్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారలకు కలక్టర్ ఆదేశించారు . వీటి పనులను ఇప్పటి నుండే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు . తుఫాను హెచ్చరిక నేపధ్యంలో అన్ని రెవెన్యూ డివిజనల్ కేంద్రాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు తెలిపారు . తుఫాను సమయంలో వినియోగించే వివిధ పరికరాల పని తీరును పరిశీలించి తధనుగుణంగా వాటిని సిద్ధం చేసుకోవాలని డిఆర్ ఓ సత్తిబాబు క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved