కోవిడ్ -19 నియంత్రణకు పక్కా ప్రణాళిక..జిల్లా కలెక్టర్

కోవిడ్ -19 నియంత్రణకు పక్కా ప్రణాళిక..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

కోవిడ్ -19 నియంత్రణలో ప్రస్తుతం జిల్లా 57 కరోనా పాజిటీవ్ కేసులు వున్నప్పటికి రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెరిగితే ఏదుర్కోడానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా వుండాలనీ కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు . సోమవారం కలక్టర్ తన కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా వైద్య శాఖలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు , ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో కోవిడ్ -19 పై తీసుకొంటున్న చర్యలను సమీక్షించారు . ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలు , ఇతర దేశాలలో వుంటున్న వారు జిల్లాకు వస్తున్నందున తదనుగుణంగా ఆసుపత్రులలో ఏర్పాట్లు వుండాలన్నారు . ఆసుపత్రుల్లో వున్న మౌళిక సదుపాయాలతో పాటు కరోనా పాజిటీవ్ కేసులు పెరిగితే ఎలాంటి ఏర్పాట్లు చేయాలని దానిపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని డాక్టర్లకు సూచించారు . కరోనా పాజిటీవ్ సంఖ్య ప్రకారం అంబులెన్స్ , పడకలు , ప్రత్యేక డాక్టర్లు లాంటి అంశాలను ప్రాంతాల వారీగా ప్రణాళిక సిద్ధంగా వుండాలన్నారు . ఆండ్రాయిడ్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు . జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రి యాజమానులు రోజు వారిగా చేస్తున్న వైద్యం పై నివేదికలు పంపాలని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులకు కలక్టర్ సూచించారు . ఈ సమావేశంలో జాయింట్ కలక్టర్ ( విలేజ్ , వార్డు అభివృద్ధి ) కీర్తి చేకూరి , డిఎమ్ అండ్ హెచ్ ఓ బి.సత్యసుశీల , జీజీ హెచ్ సూపరింటెండెంట్ డా.రాఘవేంద్రరావు , ఐఎమ్స్ ప్రతినిధి డా.రవి , తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved