జాయింట్ కలెక్టర్ గా కీర్తి

జాయింట్ కలెక్టర్ గా కీర్తి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిపాలన ళలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఉండేవారు.కొత్తగా మూడో జాయింట్ కలెక్టర్ల నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ పర్యవేక్షణ కోసం నూతనంగా నియమితులైన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు ఆమెకు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జె సి కీర్తి కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇకనుంచి గ్రామ, వార్డు సచివాలయ పర్యవేక్షణ బాధ్యతలను కొత్త జేసీ చేపడతారు. జిల్లా పరిషత్ సీఈవో జ్యోతి తదితరులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved