అవి పోర్టు భూములే..

అవి పోర్టు భూములే..

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

పేదల కోసం కేటాయించిన భూములు మడ అడవులు భూములు కావని అవి పోర్టు భూములే అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం డి కన్వెన్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేదల భూముల పై రాజకీయం చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మందికి ఇల్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయగా టిడిపి పార్టీ పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులో కేసు వేసి అడ్డుకోవడం జరుగుతుందన్నారు కాకినాడలో 34 వేల మందికి ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇచ్చి తీరుతామని ఆయన తెలిపారు. పర్లోపేట లో పేదల కేటాయించిన భూములు మడ అడవులు భూములను రాజకీయం టిడిపి పార్టీ చేయడం దురదృష్టకరమన్నారు అవి పక్కగా పోర్టు భూములని ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు పెంచడం సహజమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పని చేయడం జరిగిందని సాటిలైట్ లో స్పష్టంగా పోర్టు భూమిగా చూపిస్తున్న పటికి అవి మడ భూములను చెప్పడం చంద్రబాబుకి చెల్లిందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గా రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కొండబాబు ఆ భూములు పోర్ట్ భూములని తెలియవా అని ప్రశ్నించారు ఎట్టి పరిస్థితిలో అర్హులైన పేదలకు పక్కా ఇల్లు ఇచ్చి తీరుతామని తెలిపారు ఇప్పటికే నగరంలో 34 వేల మందికి ఇల్లు పట్టాలు ఇస్తున్నట్లు అని తెలిపారు అర్హులైన జాబితాలను గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచామన్నారు ఒకవేళ జాబితాలో పేరు లేకపోయినప్పటికీ అర్హులు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఇల్లు లేని పేదవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేయడం జరుగుతుందన్నారుకరోనాను అరికట్టడంలో ప్రజలు అధికారులు అందించిన సహకారం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు ఫ్రూటీ కుమార్ కార్పొరేటర్లు దీప్తి చంద్రకళ సుజాత సత్యనారాయణ కిషోర్ నాయకురాలు పసుపులేటి వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved