కాకినాడ కు ర్యాంక్ ... జాతీయ స్థాయిలో 11వర్యాంకు కైవసం

కాకినాడ కు ర్యాంక్ ... జాతీయ స్థాయిలో 11వర్యాంకు కైవసం

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కరోనా ,లౌక్ డౌన్ నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు అమలు చేసినందుకు కాకినాడ కార్పొరేషన్ జాతీయస్థాయిలో మంచి ర్యాంక్ ను కైవసం చేసుకుంది స్మార్ట్ సిటీ చురుకైన 100 నగరాల్లో కాకినాడ కార్పొరేషన్ కు జాతీయస్థాయిలో 11 ర్యాంకు ను సాధించింది గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టి ర్యాంకును శుక్రవారం ప్రకటించడం జరిగింది కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా ఇంటి నుంచి విధులు నిర్వహించడం ,కోవిడ్-19 నియమావళి ప్రకారం రోజు విడిచి రోజు ప్రణాళికాబద్ధంగా గా పని చేయడం జరిగింది సరికొత్త విధానాల ద్వారా అభివృద్ధి పనులు నగరంలో చేపట్టిన ఎప్పటికప్పుడు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అంతేకాకుండా రూ‌. 238 కోట్లకు సంబంధించిన పనులకు కు టెండర్లు పిలిచి కాకినాడ స్మార్ట్ సిటీ లో పూర్తి చేసిన ప్రాజెక్టులు వివరాల జాబితాను పంపించడంతో కాకినాడకు జాతీయస్థాయిలో 11 వరకు రావడం జరిగిందని కమిషనర్ కె రమేష్ తెలిపారు గత రెండు నెలలుగా కరోనా , లాక్ డౌన్ నేపథ్యంలో పారిశుద్యం మంచినీటి సరఫరా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో కాకినాడకు 11 వ ర్యాంకు రావడం జరిగిందని కమిషనర్ తెలిపారు ప్రతి ఉద్యోగి సమిష్టిగా కృషి చేయడం వల్లనే మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved