టాటా మ్యాజిక్ వాహనాలపై అన్ని రకాల ప్రభుత్వ ట్యాక్స్ లు రద్దు చేయాలి...

టాటా మ్యాజిక్ వాహనాలపై అన్ని రకాల ప్రభుత్వ ట్యాక్స్ లు రద్దు చేయాలి...

user-default | Mob: | 29 Oct

టాటా మ్యాజిక్ వాహనాలపై అన్ని రకాల ట్యాక్స్ లు 6 నెలల పాటు రద్దు చేయాలని ది.కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. గురువారం సిఐటియు ఇచ్చిన దేశవ్యాప్త కోర్కెల దినం పిలుపు మేరకు స్థానిక భానుగుడి సెంటర్ స్టాండ్ వద్ద కొంత సేపు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు వాలిశెట్టి శ్రీనివాస్, అధ్యక్షుడు దూది పాల్ శ్రీనివాస్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో టాటా మ్యాజిక్ వాహనాలు తిరిగినా తిరగకపోయినా 3 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నామన్నారు. దాంతో పాటు ఇన్సూరెన్స్ లు, ఫైనాన్స్ లు, బ్రేక్ సందర్భంగా ఫిట్ నెస్, ప్రైవేటు ఫైనాన్స్ లు, టోల్ ట్యాక్స్ ల రూపంలో చెల్లింపులు పోగా మిగిలిన సొమ్ముతో జీవనం సాగించాలన్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తమ కుటుంబాలలో అగమ్యగోచర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. నెలకు 7500/- చొప్పున 3 నెలల పాటు ఆర్ధిక సహాయం అందించాలని, 6 నెలల పాటు అన్ని రకాల ట్యాక్స్ లు రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతున్నామన్నారు. రేషన్ షాపు ల ద్వారా 18 రకాల నిత్యావసరాలు అందించాలని, మొత్తం గా ట్రాన్స్ పోర్ట్ రంగం పై ఆధారపడిన వారినందరినీ ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ 10 కోట్ల మంది ఆధారపడిన ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. బాబి, భాషా, శ్రీనివాస్, దుర్గ, మూర్తి, రాఘవ, కుబేరు, లక్ష్మణ్, బషీర్ తదితరులు పాల్గొన్నారు...

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved