మున్సిపల్ కార్మికులకు ఒక నెల జీతం అదనంగా ఇవ్వాలి..

మున్సిపల్ కార్మికులకు ఒక నెల జీతం అదనంగా ఇవ్వాలి..

user-default | Mob: | 20 Oct

కరోనా సమయం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులకు ఒక నెల జీతం గ అదనంగా ఇవ్వాలని సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తెలిపారు. గురువారం కాకినాడ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా యుటిఎఫ్ సీనియర్ నేత కె. సత్తిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమన్నారు. అయితే దీనిలో సామాన్యులకు, కార్మికులకు దక్కేది ఎంతో చూడాలన్నారు. కరోనా వైరస్ నివారణ లో మున్సిపల్,పంచాయతీ, ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలను అందరూ గుర్తించారని పేర్కొన్నారు. అయితే కనీస వేతనాలు, మెరుగైన సౌకర్యాలు, రక్షణ పరికరాలు అందించాలని సిఐటియు కోరుతుందన్నారు. వీరబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పబ్లిక్ సెలవులు అమలు చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతున్నామన్నారు. రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసరాలు అందించాలని, కార్మికులందరికీ 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు విజ్ఞప్తి చేస్తోందన్నారు. 12 వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో నాయకులు తుపాకుల వీర్రాజు, బంగారు రామకృష్ణ, ప్రసాద్, రెడ్డి శ్రీనివాస్, సత్యనారాయణ, సింగంపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు...

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved