ఆటో కార్మికులను ఆదుకోవాలి..

ఆటో కార్మికులను ఆదుకోవాలి..

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) దేశవ్యాప్తంగా ఇచ్చిన కోర్కెల దినం పిలుపు ను నగర ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జగన్నాధపురం ఏరియా కమిటీ నాయకులు జయప్రదం గా అమలు చేశారు... కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ జగన్నాధపురం వంతెన ప్రక్కన కొంతసేపు ఆందోళన చేపట్టారు.. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు సిద్ధాంతపు రవి, గంగబాబు లు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఆటో కార్మికుల ఉపాధి స్తంభించిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇంటి అద్దెలు, రోజు వారీ ఫైనాన్స్ లు, వారం ఫైనాన్స్ లు, నెలవారీ ఫైనాన్స్ లతో సాగే జీవనానికి ఒక్కసారి గా బ్రేక్ పడిందన్నారు. ప్రస్తుతం గతంలో వలే ప్రజలు ఆటో ఎక్కే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాహన మిత్ర పేరుతో 10,000/- అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో నెలకు 7,000/- రూ. చొప్పున 3 నెలలు అందించాలని, 6 నెలల పాటు ఏవిధమైన ట్యాక్స్ లు వెయ్యరాదని, ఇన్సూరెన్స్ ఫీజులు సగం తగ్గించాలని, ప్రైవేటు ఫైనాన్స్ ల వడ్డీలు రద్దు చేయాలని కోరుతూ ఆటో కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గిపోయాయని అందుకనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతున్నామన్నారు. కోవిడ్ 19 సేవలు అందిస్తున్న కార్మికులకు ఉద్యోగులకు ఒక నెల జీతం గ్రాస్ అదనంగా ఇవ్వాలని, రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసరాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు....ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారు కోయ రాజు, అధ్యక్ష కార్యదర్శులు నురుకుర్తి సూర్య ప్రకాశరావు, నక్కా కృష్ణ, నాయకులు ముత్యాలు, ప్రసాద్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, అన్నవరం తదితరులు పాల్గొన్నారు...

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved