అమలాపురం నుంచి చత్తీస్గడ్ కాలినడక పయనం

అమలాపురం నుంచి చత్తీస్గడ్ కాలినడక పయనం

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

కరోనా పిడుగుపాటుకు జిల్లా లోని వలస కార్మికులు, కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చేసేందుకు పనిలేక... పరాయి పంచన ఉండలేక... లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక సతమతమై పోతున్నారు. వారిని కదిలిస్తే స్వరం గద్గదమవుతోంది. మాటల్లో ఆవేదన... కన్నీటి చారికల్లో ఆందోళన, నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆకలి వారిని దహించివేస్తోంది.జిల్లా లో వలస కూలీలు వాళ్ల సొంత ఊరుకు వెళ్లేందుకు పైన అయ్యారు అమలాపురం నుంచి చత్తీస్గడ్ కు బయల్దేరారుకాకినాడలో పలుచోట్ల విశ్రాంతి తీసుకుని రోడ్లపైనే పిల్లాపాపలతో భోజనాలు చేశారు చాలా చోట్ల వలస కూలీలు రాత్రిళ్లు సేదతీరుతూ, పగలు కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. అలసిపోతే రోడ్లపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved