సత్యదేవుని హుండీల లెక్కింపు

సత్యదేవుని హుండీల లెక్కింపు

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

రత్నాద్రివాసుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి భక్తులు కానుకలుగా హుండీలలో వేసిన మొత్తాలను బుధవారం లెక్కించారు. గతంలో స్వామివారి హుండీలను నెలకు ఒక్కసారి తెరచి లెక్కించేవారు. అలా లెక్కించడంలో సమయాభావం ఎక్కువగా ఉంటుందని గడచిన కొన్ని నెలలుగా నెలకు రెండుసార్లు హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. అందులో భాగంగా చివరిగా హుండీలను మార్చి 10న లెక్కించడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేవాదాయశాఖ అధికారుల ఆదేశానుసారం గడచిన మార్చి 20వ తేదీ నుంచి శ్రీ సత్యదేవుని ఆలయంలో పరిమిత వైదిక సిబ్బందితో కేవలం స్వామివారికి సమర్పించే నిత్య ధూపదీప నైవేద్యాలు, రోజువారీ నిర్వహించే కైంకర్యాలు మాత్రమే చేపట్టి మొత్తం భక్తుల దర్శనాలు, ఇతర వైదిక సేవాకార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం ఇంకా లాక్ డౌన్ అమలులో ఉంది కాబట్టి మార్చి 10 నుంచి 19 వరకు ఆలయం తెరచిఉన్న రోజుల్లో భక్తులు కానుకలు వేసిన హుండీలను బుధవారం నుంచి శనివారం వరకు పూర్తిగా లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ రొటేషన్ పద్దతిలో కొద్దిమంది సిబ్బందితో నాలుగురోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం కొన్ని హుండీలను తెరచి ఈ.ఓ వేండ్ర త్రినాధరావు సమక్షంలో లెక్కించగా రూ. 10,95,835 ల నగదు, యూ.ఎస్.ఏ డాలర్ 1 లభించాయి. భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించి విధిగా సానిటైజర్లు, చేతికి గ్లౌజులు వాడుతూ రోజుకి 20మంది సిబ్బందితో జరుగుతున్న ఈ హుండీల లెక్కింపులో మిగతా హుండీలను రోజువారీగా శనివారం వరకు లెక్కిస్తామని ఈ.ఓ తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved