20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ.. మోదీ ప్రకటన

20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ.. మోదీ ప్రకటన

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 28 Oct

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానిమోదీ... కరోనా లాంటి సంక్షోభాన్ని ఎప్పడూ కనీవినీ ఎరుగలేదని అన్నారు. మన పోరాట సంకల్పాన్ని మరింతగా బలపరుచుకోవాలన్న ఆయన.. ఇంత పెద్ద ఆపద భారత్‌కు ఒక సందేశంతో పాటు ఒక అవసరాన్ని కూడా తీసుకొని వచ్చిందని చెప్పారు. కరోనా కష్టాల్లో ఉన్న భారత ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని చెప్పారు. ఇది దేశ జీడీపీలో 10శాతమని తెలిపారు ప్రధానిమోదీ. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్థిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుందన్నారు. దీనితో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందని ఆయన అన్నారు. ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రేపటి నుంచి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అందిస్తారని తెలిపారు ప్రధాని మోదీ.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved