వైద్యరంగంలో నర్సుల సేవలు అభినందనీయం..జిల్లా కలెక్టర్

వైద్యరంగంలో నర్సుల సేవలు అభినందనీయం..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ సేవా స్ఫూర్తిని అంతా కొనసాగించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి సూచించారు. నైటింగేల్‌జయంతి సందర్భంగా కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఆమె విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సులు, నర్సింగ్‌ విద్యార్థినులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగంలో రోగులకు వైద్యులకన్నా నర్సులు అందించే సేవే గొప్పదన్నారు. కరోనా బారిన పడిన బాధితులను కాపాడటానికి ఫ్లారెన్స్ నైటింగేల్ లాగా వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయం అభినందనీయం మని తెలిపారు కరోనా బాధితులకు నిత్యంసేవలు చేస్తున్న వైద్య సిబ్బందిలో నర్సుల పాత్ర చాలా కీలకం మని అన్నారు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారు సేవలను అందిస్తున్న తీరు నర్సుల పట్ల విపరీతమైన గౌరవాన్ని పెంచుతున్నారుఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో గిరిధర్‌, నర్సింగ్‌ విద్యార్థులు, నర్సులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved