కోయంబేడు వెళ్లోచ్చిన లారీ డ్రైవర్ల అందరకి వైద్య పరీక్షలు..జిల్లా కలెక్టర్

కోయంబేడు వెళ్లోచ్చిన లారీ డ్రైవర్ల అందరకి వైద్య పరీక్షలు..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

తమిళనాడు కోయంబేడు వెళ్లోచ్చిన లారీ డ్రైవర్ల అందరకి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి . మురళీధర్ రెడ్డి తెలిపారు . మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో జిల్లాలో ఉన్న లారీ వర్కర్స్ యూనియన్ , లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల తమిళనాడు కోయంబేడు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్లు కొత్తపేటకు చెందిన ముగ్గురు , అమలాపురంకు చెందిన ఒక్కరికి కరోనా పరీక్షలు చేయించ గా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అన్నారు . దీనితో తమిళనాడు కోయంబేడు వెళ్లోచ్చిన లారీ డ్రైవర్ల అందరకి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు . అదే విధంగా ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చే ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు . కోవిడ్ పరీక్షల పట్ల ఎవరు భయపడనవసరం లేదని ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి కుటుంబాన్ని , చుట్టుపక్కల ప్రాంతాల్ని కాపాడిన వారవుతారు . వైద్య పరీక్షల పట్ల నిర్లక్ష్యం వహిస్తే లారీ డ్రైవర్ లకు లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు . లారీ డ్రైవర్లు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించి , ఎప్పటికప్పుడు శానిటేజర్ల్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి అన్నారు . చట్టాన్ని గాని ప్రభుత్వం సూచించిన నియమాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు . ఈ సమావేశంలో జెసి - 2 జి రాజకుమారి , ఆర్టీవో ఇంచార్జ్ ఐ . సాయినాథ్ , కాకినాడ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రఘురాం , లారీ ఓనర్స అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ గంగ బాబు , మినీ గూడ్స్ లారీ అసోసియేషన్ సభ్యులు వి . సత్యనారాయణ , ట్యాంక్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి వెంకటేశ్వరరావు , రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved