తిరుమలకు ఆర్దిక కష్టాలు?

తిరుమలకు ఆర్దిక కష్టాలు?

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 22 Oct

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం తిరుమలకు ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా సిబ్బందికి వేతనాలు, రోజువారి వ్యయాలకు టీటీడీ ఖజానాలో తగిన నగదు లేకుండా పోయింది. ఇప్పటికే లాక్ డౌన్ కాలంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, ఇతర ఖర్చుల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. టీటీడీ వద్ద 8 టన్నుల బంగారం నిల్వలతోపాటు రూ. 14వేల కోట్లు ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయి. అయితే వాటిలో నుంచి రూపాయి కూడా తీయకుండా ఈ గండం నుంచి గట్టెక్కాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి నెలసరి ఆదాయం దాదాపు రూ. 2 వందల నుంచి 220 కోట్ల వరకు ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా 50 రోజులుగా భక్తులను అనుమతించకపోవడంతో ఆదాయం రావడంలేదు. తిరిగి ఎప్పుడు తెరుస్తారనేదానిపై టీటీడీకే స్పష్టత లేదు. టీటీడీ ఉద్యోగుల వేతనాలు, ఫించన్లు, ఇతర ఖర్చుల కోసం ఏడాదికి దాదాపు రూ. 2,500 కోట్లు అవసరం.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved