అన్నదాతకు మద్దతు ఖరీఫ్‌ కనీస మద్దతు ధరల పెంపు

అన్నదాతకు మద్దతు ఖరీఫ్‌ కనీస మద్దతు ధరల పెంపు

user-default | Mob: | 22 Oct

అన్నదాతకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు కనీస మద్దతు ధరల్ని(ఎంఎస్‌పీ) పెంచింది. వరి ధరను క్వింటాకు రూ.65 పెంచింది. రైతుకు సాగు ఖర్చుపై 50% అదనపు ధర కల్పిస్తామని చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకుని తాజాగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతరం అందుకు అనువైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 14 పంటల కనీస మద్దతు ధరను ఖరారు చేశారు. తాజా ఎంఎస్‌పీ ఖరారు వల్ల తాము పెట్టిన ఖర్చులపై సజ్జ రైతులకు 85%, మినుము రైతుకు 64%, కంది రైతుకు 60% అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఎఫ్‌సీఐతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు రైతులకు మద్దతు ధర అందించడంలో తోడ్పడతాయన్నారు. నాఫెడ్‌, ఎస్‌ఎఫ్‌ఏసీ, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు పప్పు దినుసులు, నూనె గింజల సేకరణను కొనసాగిస్తాయని చెప్పారు. పత్తికి మద్దతు ధర అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ చూసుకుంటుందన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐకి నాఫెడ్‌ కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు సరకు కొనుగోలు చేసే క్రమంలో నోడల్‌ ఏజెన్సీలకు ఏదైనా నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved