చిత్తూరు జిల్లాలో కంప్రెసర్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి?

చిత్తూరు జిల్లాలో కంప్రెసర్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి?

user-default | Mob: | 24 Oct

కంప్రెషర్‌ సిలిండర్లు పేలి ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి గాయాలైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వెల్డింగ్‌షాపులో ఆదివారం ఉదయం దుకాణ యజమాని గౌష్‌ బాషా, కార్మికులు అఫ్సర్‌, ఎజాద్‌, మంజునాథ్‌లతో కలిసి క్రేన్‌లో ఉండే రెండు కంప్రెషర్‌ సిలిండర్లపై వెల్డింగ్‌ చేస్తుండగా నిప్పురవ్వలు పడి భారీ శబ్దంతో పేలిపోయాయి. పేలుడు ధాటికి అఫ్సర్‌(19), ఎజాద్‌(17) చనిపోగా, గౌష్‌ బాషా, మంజునాథ్‌, క్రేన్‌ డ్రైవర్‌ రఫి అహ్మద్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి, బెంగళూరులకు తరలించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved