అలయన్స్ క్లబ్ శరవణ్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు

అలయన్స్ క్లబ్ శరవణ్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా స్థానిక మిలటరీ రోడ్డు లో అలయన్స్ క్లబ్ శరవణ్ అధ్వర్యంలో ఆదివారం అద్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన క్లబ్ సభ్యులు మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు చిట్టూరి వీర వర ప్రసాద్ గారి తల్లి చిట్టూరి మాణిక్యాబ శాలువ, పూలమాలలు తో సత్కరించి క్లబ్ మెమెంటో అందచేశి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అమ్మ అంటే కనిపించే దైవం అని అమ్మను మించిన దైవం లేదు అని అమ్మె మనకి మొదటి గురువు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ కుమార్ సదనాని, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ముని రెడ్డి, చిట్టూరి వీర వర ప్రసాద్, చిట్టూరి లక్ష్మి దేవి, కెంగం హరి రామ ప్రసాద్, రాయుడు వేణు గోపాల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved