బ్రహ్మశ్రీ చంద్రాభట్ల గణపతిశాస్త్రి అస్తమయం

బ్రహ్మశ్రీ చంద్రాభట్ల గణపతిశాస్త్రి అస్తమయం

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రధాన శిష్యులు, ఆంధ్ర కంచి మహా సంస్థానం అధ్యక్షులు బ్రహ్మశ్రీ చంద్రాభట్ల గణపతిశాస్త్రి (70) గుండెపోటు తో మృతి చెందారు.ఆయన గత కొన్నేళ్లుగా అస్వస్థతతో ఉండగా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని మార్చి 2న సామర్లకోట వచ్చారు.ప్రముఖ సిద్ధాంతిగా గుర్తింపు పొందిన ఆయన సామర్లకోట- పెద్దాపురం రోడ్డులో అత్యంత ఎత్తైన ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గతంలో జ్యోతిష్యం కోసం గణపతి శాస్త్రి వద్దకు వచ్చిన వారిలో ఎన్టీఆర్,చంద్రబాబు, రోశయ్య, సంజయ్ దత్ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు అసంఖ్యాకంగా ఉన్నారు. అలాగే సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో యాగం చేయించారు. గణపతిశాస్త్రి మృతికి సంతాపం ప్రకటించిన వారిలో పలువురు ప్రముఖులు శిష్యులు ఉన్నారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో గల స్వగృహంలో గణపతి శాస్త్రి అస్తమించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved