జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల్లో తనిఖీలు తక్షణమే నిర్వహించాలి

జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల్లో తనిఖీలు తక్షణమే నిర్వహించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

జిల్లా కాకినాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి సేవా సమితి ఆర్థిక సహకారంతో ఏ ఐ టి యు సి - సిపిఐ ఆధ్వర్యంలో సంఘటిత , అసంఘటిత కార్మికులకు కాయగూరలు, నిత్యావసర సరుకులు శనివారం ఉదయం ఎస్. అచ్చుతాపురం 48 వ వార్డు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా సేవా సమితి అధ్యక్షులు: సరోజినీ గారు, శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం హాజరైనారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికులకు కాయకూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సేవా సమితి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విశాఖ జిల్లాలో అమ్మోనియా లీకేజీ వల్ల చనిపోయిన బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, విచారణ అంటూ కాలం వృధా చేయకుండా ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫ్యాక్టరీవద్ద నుండి కూడా అధిక స్థాయిలో నష్టపరిహారం వసూలు చేసి బాధితుల కుటుంబానికి అందచేయాలని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మూతపడిన వాటిని ప్రారంభించేందుకు అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టాలని, ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించే కన్నా ప్రమాదాలు నివారించేందుకు అధికారులు పర్యవేక్షణ, భద్రత నియమాలు పాటించు ఉంటే ఈ ప్రమాదాలు జరిగేవి కాదని అధికారుల పర్యవేక్షణ లేనందున ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం భద్రత నియమాలు పాటించని ఫ్యాక్టరీల పై కఠిన చర్యలు చేపట్టాలని ప్రసాద్

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved