ఇళ్ళ పట్టాల భూమి చదునుకుచర్యలు.. జిల్లా కలెక్టర్

ఇళ్ళ పట్టాల భూమి చదునుకుచర్యలు.. జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ళ పట్టాల భూమి చదునుకు కావాల్సిన గ్రావెల్ ను అందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని మైనింగ్ అధికారులను కలక్టర్ డి . మురళీధర్ రెడ్డి ఆదేశించారు . శనివారం కలెక్టర్ కార్యాలయ సమావశ హాలులో కలక్టర్ డి . మురళీధర్ రెడ్డి రాష్ట్ర గనుల శాఖ సంచాలకులు వి . జి . వెంకట రెడ్డితో కలిసి ఇసుక , గ్రావెల్ పై సంబంధిత శాఖ అధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికరులతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలు చదును చేయడానికి ఉపాధి హామీ నిధులతో చేపట్టడం జరుగుతుందన్నారు . ప్రభుత్వ కార్యక్రమాలకు కావలసిన ఇసుక , గ్రావెల్ విషయంలో మైపనింగ్ , ఎ . పి . మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పని చేసి , అనుమతులు జారీలో ఎటువంటి ఆలస్యము చేయకుండా మంజూరు చేయాలన్నారు . వీటికి ఉపయోగించే ట్రాక్టర్లను తహసిల్దార్లు ధృవీకరిస్తారన్నారు . ఏ ట్రాక్టర్ ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నది వివరాలు పూర్తిగా ఉంటాయని , నిబంధనలకు వ్యతిరేకంగా ఇతర ప్రైవేట్ పనులకు తరలించే ట్రాక్టర్లను సీజ్ చేయాలని కలక్టర్ ఆదేశించారు . రెవెన్యూ డివిజనల్ అధికారులు ఉపాధి హామీ పనుల క్రింద చేపడుతున్న ఇళ్ళ పట్టాల భూమి చదును పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు . గ్రావెన్ త్రవ్వకాలలో తాత్కాలిక పర్మిట్స్ ఇవ్వడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు . జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ పర్మిట్ ఇచ్చిన మొత్తం కంటే పెనాల్టీల రూపంలో ఎక్కువ మొత్తం వస్తుందని , తాత్కాలిక పర్మిట్లు జారీ చేయడం వలన ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు . అదే విధంగా అక్రమాలను అరికట్టవచ్చన్నారు . అక్రమాలను అరికట్టవచ్చన్నారు . అనుమతులు ఇచ్చే చోట్ల సరిహద్దులు గుర్తించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని మైనింగ్ అధికారులకు కలక్టర్ డి . మురళీధర్ రెడ్డి పలు సూచనలు చేశారు . గనుల శాఖ డైరెక్టర్ వి . జి . వెంకట రెడ్డి మాట్లాడుతూ పోలవరం పునరావస పనుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళ నిర్మాణాలు చేపట్టినందున వీటికి కావల్సిన గ్రావెల్ , ఇసుక సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలన్నారు . జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ పధకాలకు కావల్సిన మట్టి , ఇసుకను అనుమతులు మంజూరులో ఎటువంటి జాప్యం లేకుండా పని చేయాలని గనులు , ఎపిమైనింగ్ డెవలప్ మెంట్ అధికారులకు గనుల శాఖ డైరెక్టర్ వి . జి . వెంకటరెడ్డి పలు సూచనలు చేశారు . ఈ సమావేశంలో జెసి - 2 జి . రాజకుమారి , డ్వామా పిడి యం . శ్యామల , డిడి మైన్స్ రంగ కుమార్ , డిస్ట్రిక్ట్ శాండ్ ఆఫీసర్ రవి కుమార్ , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved